గోగులపాటి కృష్ణమోహన్

 స్వీయపరిచయం


పేరు : గోగులపాటి కృష్ణమోహన్


గోగులపాటి కృష్ణమోహన్ స్వీయ పరిచయం


 పుట్టినరోజు13-08-1970

తల్లి దండ్రుల పేర్లు : కీ|| శే|| గోగులపాటి రుక్మిణిబాయి, కొండల్ రావు.

భార్య పేరు: శ్రీమతి రేఖాజ్యోతి

సంతానం ఇద్దరు :

కూతురు: నవ్యశ్రీ

కొడుకు: అఖిల్ శ్రీవాత్సవ్


జన్మస్థలం : గ్రా. కూనూరు, మం. భువనగిరి, జి. నల్లగొండ. (ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా)


నివాసం: ఇం. నం. 3-160, క్వార్టర్ నం. 918, సూరారం కాలని, జిల్లా : మేడ్చల్ మల్కాజ్ గిరి, గ్రేటర్ హైదరాబాద్.


ప్రవృత్తి : జర్నలిస్టు.


బిరుదులు : తెలుగు కవితా వైభవం వారిచే.. 

సహస్రకవిమిత్ర, 10-04-2016

సహస్రకవిరత్న, 

సహస్రవాణి శతపధ్య కంఠీరవ, (08-04-2017)

సహస్రవాణి సహస్రపధ్య కంఠీరవ,

సహస్రవాణి శతస్వీయ కవితాకోకిల.

ప్రతిలిపికవిప్రవీణ, 

ప్రతిలిపి కథా భారతి


పురస్కారాలు:- 

తెలుగు రక్షణ వేదిక వారిచే జాతీయ స్థాయి "బతుకమ్మ" పురస్కారం - 23-10-2016


రైతు హార్వెస్టర్, కరీంనగర్ వారి కృషి కవిత పురస్కారం (వేయి మంది కవులతో రికార్డు కవిసమ్మేళనం తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్ నమోదు) - 10-09-2017


జాగృతి కవితాంజలి పురస్కారం 

(09-09-2017 న కాళోజీ జయంతి సందర్భంగా రవీంద్రభారతి, హైదరాబాద్ లో జరిగిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డు కవిసమ్మేళనం లో పాల్గొనడం) - 


తెలుగు రక్షణ వేదిక ఆద్వర్యంలో అనంతపురంలో ప్రపంచ రికార్డు కవిసమ్మేళనం ( అనంతపురంలో  33 గంటల, 44 నిముషాల, 55 సెకన్ల పాటు ఏకదాటిగా నిర్వహించిన రికార్డు కవిసమ్మేళనంలో పాల్గొని ఐదు రికార్డులతో (తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంద్ర బుక్ ఆఫ్ రికార్డ్స్, యన్.టి.ఆర్. బుక్ ఆఫ్ రికార్డ్స్, తానా బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్.) తో కూడిన సర్టిఫికెట్ జ్ఙాపిక.

15 - 10 - 2017


తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తేది 17-12-2017న జరిగిన సమావేశంలో నేను "తేటతెనుగు భాష నా భాష" అనే కవితా పఠనము చేయడం జరిగింది, ఈ సందర్భంగా తెలంగాణా గ్రందాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్, నాళేశ్వరం శంకరయ్య తదితరుల చేతులమీదుగా మెమొంటో, శాలువా, నగదు పురస్కరం తో సన్మానం.


తెలంగాణ వికాస సమితి, తెలంగాణ రచయుతల సంఘం ఆధ్వర్యంలో... వనపర్తిలో జరిగిన తెలంగాణ జల కవితోత్సవం పురస్కారం

06-05-2018


తెలంగాణ సాహిత్య అకాడమీ మరియు యాదాద్రి భువనగిరి జిల్లా రచయుతల సంఘం సంయుక్త ఆద్వర్యంలో నిర్వహించిన సాహితీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రశంసాపత్రము.

23-05-2018.


రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ నిర్వహించిన కవిసమ్మేళనం లో పాల్గొని జిల్లా కలెక్టర్ చేతులమీదుగా పురస్కారం... 02-06-2018.


ఉదయకళానిధి ఆధ్వర్యంలో యాదాద్రి దేవాలయ శిల్పులకు అక్షరనీరాజనం కార్యక్రమం నిర్వహణలో లో క్రియాశీలకపాత్ర..


09-09-2018 తెలంగాణ సాహిత్య అకాడమీ ఆద్వర్యంలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకలో పాల్గొని కవితా గానం... సన్మానంతో పాటు నగదు పురస్కారం.


మెతుకు సీమ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ సాహితి సంస్థ నిర్వాహకునిగా ఉగాది పురస్కారం


ఆన్ లైన్లో శతాధిక అష్టావధానాల నిర్వహణ: తేది 31-01 2019 న విళంభి నామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి రోజు సాయంత్రం 7 గంటలకు మొదలు తేది 18-5-2019 శనవారం వరకు అనగా వికారి నామ సంవత్సర వైశాక శుద్ద పూర్ణిమ తో అమ్మవారి కృపాకటాక్షాలతో... ఆన్లైన్ అవధాన ప్రక్రియకు శ్రీకారం 108 రోజులపాటు నిరంతరాయంగా, నిర్విఘ్నంగా అవధాని శ్రీ గౌరిభట్ల బాలముకుంద శర్మ గారిచే నిత్యావధానం 


భావితరాలకు అవధానప్రక్రియను, అవధానుల పరిచయం చేసే సదుద్దేశంతో వాట్సప్ వేదికగా 12 మంది అవధానుల తో దృశ్య శ్రవణ అష్టావధానాల నిర్వహణ, ఇందులో ప్రముఖ మరియు నవావధానులతో అష్టావధానమ్ నిర్వహించి, వాటిని యూట్యూబ్, బ్లాగులలో నిక్షిప్త పరచడం..


సాహితీసేవలో భాగంగా ఇప్పటి వరకు

కవుల కవితలు బద్రంగా ఉండేందుకు దాదాపు నూటాయాబైకి పైగా బ్లాగుల నిర్వహణ



*చేపడుతున్న కార్యక్రమాలు*


భావితరాలకు సాహితీ పరిమలాలు అందించాలనే ఉద్దేశంతో విద్యార్ధినీ విద్యార్ధులకు సృజనాత్మక రచనా కార్యశాలల ఏర్పాటు,


బాలోత్సవాల పేరిట పిల్లలలో ఉన్న సృజనాత్మకత వెలితీసే కార్యక్రమాలు


కొత్త కవుల పుస్తకాల ముద్రణకొరకు సహకారం


పలు అంశాలపై పుస్తక సంకలనాలు


*బాధ్యతలు*


వ్యవస్థాపకులు : తెలుగు కవన వేదిక...

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం 


వ్యవస్థాపకులు: మరియు నా ఫౌండేషన్...

ఆపద్బంధు ద్వారా సేవా కార్యక్రమాలు 


వ్యవస్థాపక అధ్యక్షుడు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం.


సంఘాన్ని స్థాపించిన సంవత్సరకాలం లోనే సంస్థ తరపున మూడు సంకలనాలు తీయడం తో పాటు తనతో పాటు మరో నలుగురి కవుల ప్రథమ సంపుటీల ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు.


బాలోత్సవాల పేరుతో తొమ్మిది వందలకు పైగా బాలబాలికలకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగేలా పలు కార్యక్రమాలు నిర్వహించి  ప్రోత్సహించారు. ప్రతిభను కనబర్చిన వారికి కావ్యకానుకలతో పాటు ప్రశంసాపత్రాల అందజేత.


భావితరాలకు సాహితీ పరిమళాలు అందించాలనే ఉద్దేశంతో... సృజనాత్మక రచన కార్యశాలలు ఏర్పాటు చేశారు.


ముద్రితాలు ; 

కవి విశ్వంభరుడు సంకలనం (సినారె యాదిలో వారి 87వ జయంతి పురస్కరించుకొని ఎనుబైఏడు మంది కవనాలతో కేవలం ఇరువై రోజులలో కవితా సంకలనం ఆవిష్కరణ)


కృష్ణ కందాలు : కంద పద్యాల శతకం


వీరసైనికా వందనం (సంకలనం)

సరిహద్దులో మన కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తున్న వీర సైనికులకు అంకితం ఇస్తూ జిల్లా లోని యాబై ఎనిమిది మంది కవులతో సంకలనం.


జలనిధి కాళేశ్వరం: తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలువనున్న మేడిగడ్డ వద్ద శరవేగంగా నిర్మితం అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు రూపశిల్పులకు అక్షరనీరాజనం కోసం సుమారు మూడువందల మంది కవులతో సంకలనం.(విడుదలకు సిద్ధం)


అముద్రితాలు

కృష్ణ చైతన్యం (భావ కవితలు)


కృష్ణ ఆటవెలదులు

శతకం


కృష్ఞ కథలు

మినీ (కార్డు) కథలు


రచనలు

ఐదువందలకు పైగా వచన, భావ కవితలు. కార్డుకథలు, నానోలు, నానీలు, మణిపూసలు, ఇష్టపదులు, పద్యాలు మొదలగు ప్రక్రియలలో పలు రచనలు, 


కార్డు కథలు... వ్యాసాలు.


అభిరుచులు : సామాజిక సేవ, క్రీడలు, కవనాలు, సినిమాలు,  వార్తాసేకరణ, యాంకరింగ్, స్నేహం


సాహితీ సేవలు:-


మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం ద్వారా జిల్లా కవులందరినీ సమీకరించడం, ఔత్సాహిక కవులకు కవన రచనలో మెలుకువలు నేర్పడం, భావి తరాలకు సాహితీ పరిమళాలు అందించాలనే సత్సంకల్పంతో బాలకవులకు సృజనాత్మక రచనా కార్యశాలలు ఏర్పర్చడం...బాలోత్సవాల నిర్వహణ,  ముఖ్యమైన అంశాలతో పాటు కవితా సంకలనాల ద్వారా కొత్త కవులకు సంకలనంలో అవకాశాలు కల్పించడం.


తెలుగు కవన వేదిక ద్వారా తెలుగు భాషాభివృద్దికోసం సత్ సంకల్పం తో వారం వారం ప్రత్యేక అంశాన్ని ఇస్తూ కవుల ద్వారా కవితలను సేకరించి వాటిని బద్రంగా బ్లాగులో పొందపరచడంతో పాటు వాటిని తెలుగు కవన వేదిక అనే పేరుతో అంతర్జాల సాహిత్య  పత్రిక రూపంలో కూడా సంచికలను వెలువరిస్తున్నాను.


తేది 19-08-2019, సోమవారం రోజున సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రెండువందలకు పైగా విద్యార్థులచే బాలసాహిత్యం పై సృజనాత్మక రచనా కార్యశాల ఏర్పాటు.


స్వగ్రామం యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం కూనూరు గ్రామంలో గ్రంథాలయ ఏర్పాటు కోసం సన్నాహాలు.


పుస్తక రూపకల్పనలు 

(డిటిపి, ముద్రణ భాద్యతలు)

ముద్రితాలు:-

కవి విశ్వంభరుడు (సంకలన కర్త)

కృష్ణకందాలు (స్వీయ సంపుటి)

రెప్పచాటు మౌనం

నేను సైతం

రవికిరణాలు

వీరసైనికా వందనం (సంకలన కర్త)

అమృతవాక్కులు (౧౩)

అమృతవాక్కులు (౧౪)

మల్లినాథసూరి (సంకలనం)

సైనికార్చన (సంకలనం)

జలమే జగతికి మూలం (సంకలనం)

కందాళై రచనలు

తొలకరి జల్లు

శతచ్ఛంద గణాధిపమ్ (సంకలనకర్త)

చిద్విలాస శతకం

కరుణించి కాపాడు భద్రకాళీ


అముద్రితాలు:-

జలనిధి కాళేశ్వరం (సంకలనం)

అమృతమూర్తికి అక్షరాభిషేకం (సంకలనం)

కృష్ణ చైతన్యం


NA FOUNDATION (నా ఫౌండేషన్)

సంస్కృతి, సమాజం, సాహిత్య సేవే లక్ష్యంగా నా ఫౌండేషన్ స్థాపించి ఆయా రంగాలలో విశేష ప్రతిభ కనబరుస్తున్న వారిని సేవా బంధు పురస్కారంతో ప్రోత్సహం...


నినాదం : 

కులరహిత సమాజం నిర్మిద్దాం....  

ఆర్ధిక అసమానతలు తొలగిద్దాం....


చరవాణి నంబరు: 9700007653

ఇ.మెయిల్ :  krishnamohan138@gmail.com

బ్లాగు :  http://krishnamohan138.blogspot.com

Comments